FaithWalk
← Back to Songs

Song #173

యేసుని ప్రేమ స్మరణ

రాగం: శంకరాభరణముతాళం: ఆది✍ దారము ఆరోర్టము

Lyrics

రా - శంకరాభరణము తా-ఆది

యేసుని (ప్రేమను - నేమారకను - నెప్పుడు దలంచవే యో మనసా =

వాసిగ నాతని - వరనామంబును - వదలక పొగడవె యో మనసా॥

"పాపజనులు, “ఆహారము. విస్తారముగా, గొప్పు 'వకులునే, "భూమియందు.

"శరీరము. ప్రకాశించు. “జైలుదేరి. "సంతోషములు.

151 క్రీస్తు కృపా ప్రేమలు

1. పాపులకొరకై - ప్రాణము బెట్టిన - ప్రభు నిల దలంచవె యో మనసా =

శాపము నంతయుం - జకంగ నోర్చిన - శాంతుని పాగడవె యో మనసా

॥యేసుని॥

2. కష్టములలో మన - కండగ నుండిన - కర్తను దలంచవె యో మనసా =

నష్టములన్నియు - నణంచిన యాగురు - శ్రేష్టుని పొగడవె యో మనసా

యేసుని॥

3. మరణతతిని మన - శరణుగ నుండెడు - మాన్యునిం దలంచవె యో

మనసా = కరుణను మన కన్నీటిని దుడిచిన - కర్తను పొగడవె యో

మనసా ॥యేసుని॥

4. ప్రార్థనలు విని - ఫలముల నొసంగిన - ప్రభు నింక దలంచవె యో మనసా

వర్ధనం గోరుచు - శ్రద్ధతో దిద్దిన - వంద్యుని పొగడవె యో మనసా

॥యేసుని॥

5. వంచనలేక - వరముల నొసంగిన వరదునిం దలంచవె యో మనసా =

కొంచెము కాని - కూర్మితో దేవుని - కొమరుని పొగడవె యో మనసా

॥యేసుని॥

= దారము ఆరోర్టము

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 118