Lyrics
రా - శంకరాభరణము తా - రూపకము
అన్నా మన యేసు ప్రభుని - కన్న రక్షకుండు లేండు = ఎన్న రాని మన
'యఘము - లన్ని సడలించి ప్రోచు ॥నన్న!
1. మన దోషములకు బదులుగ - మరణావస్థల నొందెను = తన
దివ్యావయవముల ర - క్షము చిందించెను భువిపై ॥నన్న|
2... నిజ రక్షకుండితండే మన వృజినాదులం బరిమార్చను = విజయం బగు
నతని పాద - రజయుగ్మమును స్మరించు ॥మన్న॥
3. దిక్కు మాలిన వారికి - దీక్షై మార్గముంజూపెను = చక్కనీ గుణముల సాం
- పెక్కి వర్తించె నహహ ॥యన్న॥
4. ఈలాటి దయాసముద్రు - నిల నెందైనను గానము = నీలోం గల దుర్గుణాది
- జాలంబులం గడం ద్రోయును ॥అన్న॥
5... మృతి గెల్చిన వా౭డే దు - రిత జీవుల? బ్రోవం దగును = మృతి నొంది
నశించు లోక - మూధాత్ముల కేల గల్లు ॥నన్న॥
= రావూరి లక్ష్మయ్య
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 110