Song #157
వ్యాధి బాధితురాలిని స్వస్థపర్చుట
Lyrics
రా - ఆనందభైరవి (చాయ: దేవుని ప్రేమ యిదిగో) తా - కురుర్ఫుంపె
యేసు వస్తపు చెంగును - మాత్రమే - యాసించి ముట్టినట్టి = దోసకారుల
రోగముల్ - వెంటనే - తొలంగి పోయెను నిజముగ ॥యేసు॥
1... గుంపుకూడిన జనులతోం - (బ్రభు యేసు - సొంపుతోం బోవునపుడు =
'తెంపుతో రమణి యొకతె - ప్రభు చెంగు - తెలియకుండను ముట్టెను॥ యేసు॥
2. అంతటను రక్తధార - యామె కొ - కింతైన లేకపోయె = ఇంతలోం
ప్రభువు యెటింగి - తనయొక్క - వింతం జూపెను జనులకు ॥|యేను॥
3. ప్రజలార మోలో నొకరిన్ - నాదు ప్ర - భావంబు స్వస్థపరచె = నిజమంచుం
ప్రభువు చెప్ప - వణుకుతో - గజయాన వచ్చి నిల్చె ॥యేసు॥
4 ఒదుగుచుండిన వనితతో - శ్రీయేసు - అదురు మానుమి యింకను =
ఇదిగో నీ విశ్వాసము - రక్షించె = ముదిత నెమ్మదిని వెళ్లు ॥యేసు॥
5. ఏపుమోరగ యేసును - మీ యొక్క - ప్రాపుగా నమ్ముకొనుండి = ఆపదలు
దొలంగించును - నిజముగం - పాపముక్తులం జేయును ॥యేను॥
- తూవిలి బెంజిమిన్
Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 106