FaithWalk
← Back to Songs

Song #156

క్రీస్తు తుఫానును నిమ్మళపర్చుట

రాగం: ముఖారితాళం: త్రిపుట✍ నలి మెజర్‌

Lyrics

రా- ముఖారి తా- త్రిపుట

ఏలాటివాందో కాని - యీ యేసుని - నేమని వివరింతుము = గాలివాన

యేసుని - గద్దింపునకుం చాల భయపడి నిలిచెను ॥ఏలాటి॥

1. ముద్దు శిష్యులతోడను - సముద్రపు - టద్దరికి వెళ్లైను = కొద్ది పడవనెక్కెను

= ఇంతలోనె - పెద్దగాలి రేగెను ॥ఏలాటి॥

2. అల్లకల్లోలముగా - సముద్రము - అల్లలాడు నప్పుడు = చల్లంగ దోనె

వెనుక - తలగడపైని - మెల్లన నిదువోయెన్‌ ॥ఏలాటి॥

3. చింత లేదా యేమయ్యా - బోధకుండా న - శించిపోవుచున్నాము = ఎంతో

వేదన పడితిమి - కాపాడుమ - టంచు శిష్యులు లేపిరి ॥ఏలాటి॥

4 దిగ్గునం బ్రభువులేచి - యా గాలిని - గద్దించిన వెంటనే = తగ్గి నిమ్మళించెను

- సమస్తము - సద్దు ఉడిగిపోయెను ॥ఏలాటి॥

5. ఏల భీతు లైతిరి - యింతలోనే - యెంత నమ్మిక లేదని = యీలాగు.

నోదార్చెను - యేసు తన - సొంత శిష్యుల నప్పుడు ॥ఏలాటి॥

= నలి మెజర్‌

Section: 135 క్రీస్తు జీవితము - ఉపదేవములు · Book page: 106