Lyrics
రా- మోహన తా - మిశ్రచాపు
నీవేయని నమ్మిక - యేసునాకు - నీవేయని నమ్మిక = నీవే మార్గంబు -
నీవే సత్యంబు - నీవే జీవంబు - నీచే సర్వంబు ॥నీవే॥
1 క్రీస్తు నామమున - విరుడములు
'పెడదారిని బోవగ - నామోదికి - ఇడుమలెన్నియొరాగ = అడవిలోబడి
నేను - ఆడలుచు నుండగ - తడవకుండ దొరుకు - ధన్యుమౌ మార్గంబు
నీవే!
2. కారుమేఘుమువట్టగ - నా మనస్సులో - కటిక చీకటివుట్టగ =
'ఘోరాపదలుచేరి - దారియని బ్రమపడగ - తేరిచూడగల్లు - తేజోమయ
మార్గంబు ॥నీవే॥
3. __ లేనిపోని మార్గంబు లెన్నోయుండ - జ్ఞానోపదేశంబు = మానుగజేయుచు -
వానినిఖండించి - నేనే మార్గంబన్న - నిజమైన మార్గంబు ॥నీవే॥
4. నరలోకమునుండి పరలోకంబు - వరకు నిచ్చెనగా నుండి = నరులకు
రా
ముందుగ - నడచుచు ముక్తికి - సరిగా కొనిపోవు సు - స్థిరమైన మార్గంబు
"నీవే!
= ముంగమారి దేవదాను
Section: కక దైవస్తుతి · Book page: 96