Lyrics
రా- కాంభోజి తా-ఆది
యేసు నీ నామామృతము మా - కెంతో రుచి యయ్యా - దేవ = మా -
దోసములను హరించి మోక్షని - వాసులుగం జేయుటకు - భాసుర ప్రకాశమైన
॥యేసు॥
1... వేడు కలరంగం గూడి నినుం గొని - యాడు వారికి - దేవ = యెంతో -
కీడు జేసిన పాడు వైరిని - గోడుగో డనంగ వాని - తాడనము జేసితివి
యేసు॥
2. _ పాపములు హరింప నీవే - ప్రాపు మాకయ్యా - దేవ = నీ - దాపు జేరిన
వారి కందరి - కాపదలు బాపి నిత్య । కాపుగతిం జూపినావు ॥యేసు॥
3. అక్షయ కరుణేక్ష భువన - రక్షకా నీవే - దేవ = మమ్ముం - పక్షముగ
రక్షించి మోక్షను - రక్షణకు దీక్ష గొని - వీక్షితులమైన మాకు ॥యేసు॥
4. _ అందమగు నీ మందిరమున - బొందుగా మేము - దేవ = నీ - సుందర
కరుణామృతము మా - డెందముల యందు గ్రోలు - టందుకు సుందరమైన
॥యేసు॥
- ఊానేవు దానియేలు
కుమారుడగు దేవుడు 126
Section: కక దైవస్తుతి · Book page: 94