FaithWalk
← Back to Songs

Song #138

యేసు నామము పావనము

రాగం: ఆనందభైరవితాళం: అట✍ పురుషోత్తమ చౌధరి

Lyrics

రా - ఆనందభైరవి తా-అట

యేసు నామమే పావనము - మాకు - యేసు గద నిత్య జీవనము = దాస

జన 'హృద్వికాసమైయెల్ల - దోసములకు వి - నాశకరమైన ॥యేను॥

1. సాధు మానసోల్లాసములు యేసు - నాధు గుణ చిద్విలాసములు = బోధం

గొను వారి - బాధ వెడలించి - మాధుర్యమగు ముక్తి - సాధనములిచ్చు.

॥యేసు॥

2. “భక్త జన లోక పూజ్యములు “రక్త - సిక్త పాదపయోజములు = “ముక్త

రాజ్యాఖి - షిక్తుండౌ సర్వ - శక్తి యుతుండైన - సామియగు క్రీస్తు ॥యేసు॥

3. దీన జన నిత్య తోషణము - సిల్వ - మ్రూని ప్రభు మృత్యు ఘోషణము =

“పానకము జుంటి - తేనియల "స్వాదు - వీనులను ోగ్రోలు - మానవుల కెల్ల

బయేసు॥

4 పాపులకు మంచి “పక్షములు - ముక్తిం జూపు క్రీస్తు కటాక్షములు = పాప

"సందోహ - కూపమునం గూలు - కాపురుషు నన్నుంగాచుకొనిప్రోచు ॥యేసు॥

= పురుషోత్తమ చౌధరి

Section: కక దైవస్తుతి · Book page: 92