Lyrics
రా- బ్యాగు తా-ఆది
ఇశ్రాయేలీయుల దేవుండే - యెంతో స్తుతి నొందును గాక = యాశ్రితువౌ
తన జనులకు దర్శన - మాత్మ విమోచన కలిగించె ॥నిశ్రా॥
1. తన దాసుండు దావీదు గృహంబున - ఘన రక్షణ శృంగము నిచ్చె = మన
శత్రువు లగు ద్వేషులనుండియు - మనలన్ బాపి రక్షణ నిచ్చె ॥నిశ్రా॥
2. దీనిని గూర్చి ప్రవక్తల నోట - దేవుండు పలికించెను దొల్లి = మానవ మన
పితరుల గరుణింపంగ - మహిలోన నిబంధనం జేసె ॥నిశ్రా॥
3. జనకుం దగు నట్రాహాముతోం - జేసిన యా ప్రమాణముం దలంచి =
మనము విరోధులనుండి విమోచన - గని నిర్భయులమై మెలంగ ॥నిశ్రా॥
4. ఆయన సన్నిధానమునందు - నతి శుద్ధిగ నీతిగ నుండం = పాయక తన
సేవను నిత్యంబును - జేయంగ నీ రక్షణ నిచ్చె ॥నిశ్రా॥
ర్. ధరనో శిశువా దేవుని దీర్భ - దర్శి వనెడు పేరొందెదవు = పరమేశ్వరుని
వాత్సల్యతతోం - పాపవిముక్తి బ్రజ లొంద ॥నిశ్రా॥
6 మానుగ రక్షణ జ్ఞాన మొసంగంగ - మార్గము సిద్ధపరచుటకై - దీన
మనస్సుతోం బ్రభునకు ముందు - గా నడిచెదవు భయభక్తి ॥నిశ్రా॥
7. మరియును సమాధాన సరణిలో - మన మింక నడువం జీంకటిలో =
మరణచ్చాయలో నుండిన వారికి - నరుజోదయ దర్శన మిచ్చె ॥నిశ్రా॥
8. జనక పుత్రాత్మ దేవుని కిలలో - ఘనత మహిమ కల్గును గాక = మును
పిపు డెప్పుడు తనరి నట్లు యుగ - ములకును దనరారునుగా కామేన్ ॥నిశ్రా॥
- మల్లెల దావీదు
Section: కక దైవస్తుతి · Book page: 84