Lyrics
రా - యదుకుల కాంభోజి తా-ఆది
చూడరే మాతేండు - పుట్టి - నాండు బెత్లెహేములో = నేండీ భూమి
వాసులకు - నిండు రక్షణబ్బెను ॥చూడరే॥
1... ఎన్నరాని దేవ దీప్తి - మున్ను మిన్ను గ్రమ్మెను = పన్నుగా రేయెండ కాంతి
- కన్ననది మించెను ॥చూదరే॥
2. దూత తెల్చె ద్రేల కొక - ప్రీతియగు ముచ్చటన్- ఖ్యాతిగ దావీదు పురిని -
కర్తయేసు పుట్టుటన్ ॥చూడరే॥
3. తూరుపున జ్ఞానులొక్క - తార దివిని గాంచిరి = వారు వీరు వచ్చి సేవ -
వరుసగాను జేసిరి ॥చూడరే॥
4. మక్కువతో మనమెల్ల - యొక్క సేవం జేతము = మిక్కుటముగ మనకు
శాంతిం - గ్రక్మున నొసంగును ॥చూడరే॥
- వాక్ వౌధరి
Section: కక దైవస్తుతి · Book page: 82