FaithWalk
← Back to Songs

Song #12

రక్షకుని జననము

రాగం: మధ్యమావతితాళం: అట

Lyrics

రా - మధ్యమావతి తా- అట

రక్షకుండుదయించినాండంట - మనకొరకుంబరమ - రక్షకుం డుదయించి

నాండంట = రక్షకుం డుదయించినాండు - రారె గొల్లబోయలార - తక్షణమునం

బోయి మన ని - రీక్షణ ఫల మొందుదము ॥రక్షకుండు॥

1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాండు = దేవుండగు యెహోవా

మన - దిక్కు: దేరి చూచినాండు ॥రక్షకుండు॥

2. గగనమునుండి డిగ్గి - ఘనుండు గట్రియేలు దూత = తగినట్టు చెప్పె వారికి

- మిగుల సంతోషవార్త ॥రక్షకుందు॥

3. వర్తమానము జెప్పి దూత - వైభవమున పోవుచున్నాండు = కర్తను జూచిన

వెనుక - కాంతుము విశ్రమం బప్పుడు ॥రక్షకుండు॥

4 _ పశువుల తొట్టిలోన - భాసిల్లు వస్రములజుట్టి = శిశువును గనుగొందురని

- శీఘ్రముగను దూత తెల్చె ॥రక్షకుండు॥

5. అనుచు గొల్ల లొకరి కొక - రానవాలు జెప్పుకొనుచు = అనుమతించి

కడకుం క్రీస్తు - నందరికినీ దెల్పినారు ॥రక్షకుండు॥

= హౌరర్ల రాఘవయ్య

n3 క్రీస్తు జన్మదినోత్సవము

రా - శంకరాభరణము తా-ఆది

'సంతోషించుండి - యందరు నాతో - సంతోషించుండి - యొక = వింతయగు.

కీర్తనం బాడ వచ్చితిని - సంతోషించుండి - నాతో ॥సంతో॥

1. అంధకార మయమైన భూమి నా - ద్యంతము వెలింగింప - దాని యా -

'వేశముం దొలంగింప = వందితుండు క్రీస్తేసు నాధుండు - వచ్చెం బ్రకాశుండై

- భూమికి - నిచ్చె ప్రకాశంబు ॥సంతో॥

2. కాన నంధకారంబు దొలంగం ప్ర - కాళశించెను లెండు - మరు ప్ర -

కాశింపను రండు = మానవులను సంతోషపర్చనై - మహిని నవతరించె -

భక్తుల - మనము సంతసించె ॥సంతో॥

109 యేసు జన్మము

3. మిన్ను నుండి సంతోషోదయము - మిగుల ప్రకాశించె - హృదయముల

- దగులం ప్రకాశించె = మున్ను జేయంబడిన వాగ్ధత్తము - తిన్నగ నెరవేరె

భక్తుల - కన్ను లాస దీర ॥సంతో॥

4 ప్రీతియైన నీ పండుగ గూర్చి - నూతన కీర్తనను - గలసికొని - నాతోం

పాడుచును = నీ తరి దూరస్థుల కీ వార్తను - నే తీరును నైనం - దెలుపంగ -

నాతురపడవలెను ॥సంతో॥

5. పాపులపై దేవునికి గలిగిన - ప్రబలమైన దయను - లోకమునం - జూపింపం

గవలెను = జూపకపోయిన లోపము మనపై - మోపంబడును నిజము -

వేగము - జూపుద మా పథము ॥సంతో॥

Section: కక దైవస్తుతి · Book page: 76