Lyrics
రా - కానడ తా-ఆది
నమో యేసునాధా - నాధా - నమో జీవనాధా = సమాన విరహిత
సనాతనాత్మా - సమున్నతోజ్వల ప్రశాంత ధామా ॥నమో॥
9 యేసుక్రీస్తు స్తుతి
1. స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగ = భూ
వలయాకాశంబుల మించుచు - భువన పాలనముజేసెటి ప్రభువా ॥|నమో॥
2, ధరణీ మానవ విమోచనార్థము - కరుణను జీవము లొసగిన ప్రభువా =
పరమ కృపాభరితా మృతసారా వరసజ్ఞన హృదయాబ్ద విహారా ॥నమో॥
3. సుందర మలయజ గంధ ధూపముల - చందముననుమా వినుతులు గొను
మా = వందే దేవ దయాసందీప = వందే శుభదానంద స్వరూపా ॥నమో॥
-ఇజి ఆనందము
Section: కక దైవస్తుతి · Book page: 60