FaithWalk
← Back to Songs

Song #87

క్రీస్తుకు నమోనమః

రాగం: శంకరాభరణముతాళం: అట

Lyrics

రా - శంకరాభరణము తా- అట

1. సర్వలోక సం పూజ్యా - నమోనమో - సర్వ జ్ఞాన సంపూర్ణా - నమోనమో.

- సర్వ సత్య సారాంశా - నమోనమో - దేవా గావో ॥

2... దీన భక్త మందారా - నమోనమో - దోష శక్తి సంహారా - నమోనమో -

దేవ యేసావతార - నమోనమో - దేవా గావో ॥

3. దేవలోక ప్రదీపా - నమోనమో - భావలోక ప్రతాపా - నమోనమో -

పావనాత్మ స్వరూపా - నమోనమో - దేవా గావో ॥

4. వేదవాక్యాదర్శ మోవె - నమోనమో - వేద జీవమార్గం బీవె - నమోనమో

- వేదవాక్కును నీవే - నమోనమో - దేవా గావో ॥

5. శాపగ్రహివైతివి నాకై - నమోనమో - ప్రాణత్యాగివైతివి. నాకై - నమోనమో

- ప్రాయశ్ళ్చిత్తమైతివి నాకై - నమోనమో - దేవా గావో॥

భానుమూర్తి

Section: కక దైవస్తుతి · Book page: 60