Lyrics
రా- బేహాగ్ తా-ఏక
ఇదిగో నీతిభాస్మరుండు - ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను
నిలిచి = మది తమోగుణంబులణపె - సదమల జ్ఞానంబు నొసంగె ॥ఇదిగో॥
1. ఎవని జ్ఞానమహిమ విభవ - మెవనినీతి బలప్రకాశ - మెవని మనుజ
రూపమాయె = నవవినీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి ॥ఇదిగో॥
2. నరజనముల నీతియెవడో - ధరణిపతుల దీప్తియెవడో - దురితబుణము
దీర్చునెవండో = పరమపురుషు డేసుండతండె - నిరతజీవ మొసగునిపుడె
॥ఇదిగో!
౩. కలుష మెల్ల బాపదలంచి - కలువరి గిరివరకు నడచి - యలవికాని ముక్తి
గూర్చన్ = సిలువమద బలియై మరణ - బలమునణంచి తిరిగిలేచె ॥ఇదిగో॥
4. మదితమం బదెచటికరిగె - యెదను కఠినతనము కరిగె - హృదయరసము
లతిశయించి = సాధుగుణముగలిగి యేసు - పాదములను గొలుతు నిపుడె
॥ఇదిగో!
ర్. _ జనగణముల జీవమతండె - ధనఘనముల దాతయతండె - యనుభవమున
నెజుంగుమతని = యనుపమ (ప్రేమా మృతంబు - ననవరతా నందకరము
॥ఇదిగో॥
= వెట్టి భానుమూర్తి
Section: కక దైవస్తుతి · Book page: 58