Lyrics
'రా - యదుకులకాంభోజి తా-ఆది
యేసుని భజియింపవే మనసా - నీ దోసములు చనం - జేసి కృపతోం
ట్రోచునే మనసా = వాసి కెక్కిన క్రీస్తు మోక్షని - వాసిగా కింక వేరేలేరని -
దోసిలొగ్గి నుతించితే నిను - త్రోసివేయండు దోసకారని ॥యేసు॥
1. ఏటికే నీ కీదురాశలు - నీ - కెప్పుడును చెవి - నాటవుగ ప్రభు యేసు
వాక్యములు = వాటముగ నా తుది దినమున - నీటుమిజంగ నిత్యజీవ కి -
రీటమును నీకిత్తు నని తన - నోటం బల్మిన మాటం దప్పండు ॥యేసు॥
2. ఖండనగ నిను చెండియాడండు - యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు
నతండితండు = అండంబాయక నిన్ను ప్రతి దిన - గండములను హరించునని
నీ - వుండ గోరిన నిండు నెమ్మది - దండింగ నీకుండం జెప్పును ॥యేసు॥
3. లోక సైతాను దుర్భోధలు - నీ వాలింపక యా - లోకరక్షకుని సుబోధలు
= ఏక మనసుతో రాత్రింబగలు ప - రాకులేకను గాచు నా ప్రభు - రాకడను
నీవెజింగినను పర - లోకశుభ సుఖసౌఖ్య మొసంగును ॥యేసు॥
4. వంచనలు మది నుంచకే మనసా - నీ - దుర్గుణము తలం ద్రుంచి ప్రభుని
'సేవింపవే మనసా = అంచికముగా క్రీస్తు దీప్ర - పంచ జనుల భవాల్థినావగ
- నెంచి నీ భవభార మతనిపై - నుంచి సతము ప్రార్థించు మనసా ॥యేసు॥
క్. నిన్ను పాప బంధముల నుండి - రక్షించుటకు స - ర్వోన్నతుని కుమారు
డై వెలసి = ఎన్నంగ నీవొందు దుఃఖము - లన్నిటిని తా ననుభవించెను -
విన్న తక్షణ మేసుక్రీస్తుని - విశ్వసించి సుఖించు మనసా ॥|యేసు॥
= రావూరి లక్షయ్య
Section: కక దైవస్తుతి · Book page: 56