Lyrics
రా- శహన తా- త్రిపుట
విజయగీతముల్ పాడరే - క్రీస్తుకు జయ - విజయగీతముల్ పాడరే =
వృజిన మంతటి మోంద - విజయ మిచ్చెడు దేవ - నిజకుమారుని నామమున్
- హృదయములతో - భజన జేయుచు నిత్యమున్ ॥ విజయ॥
1, మంగళముగ యేసుండే - మనకు రక్షణ - శృంగమై మరి నిల్చెను -
నింగిన్ విడిచి వచ్చెను - శత్రుని యుద్ధ - రంగమందున గెల్చెను = రంగు
మోరంగందన - రక్తబలము వలనం - పొంగు నణంగంజేసెను - సాతానుని
బల్ - క్రుంగ నలిపి చీల్ళెను ॥విజయ॥
2. _ పాపముల్ దొలంగింపను - మనలను దన స్వ - రూపంబునకు మార్చను
- శాపం బంతయు నోర్చెను - దేవుని న్యాయ - కోపమున్ భరియించెను =
పాప మెరుంగని యేసు - పాపమై మనకొరకు - పాపయాగము దీర్చెను -
దేవుని నీతిన్ - ధీరుండై నెరవేర్చెను ॥విజయ॥
3. సిలువ మరణము నొందియు - మనలను దనకై - గెలువన్ లేచిన వానికి
- చెలువుగన్ విమలాత్యుని - ప్రేమను మనలో - నిలువన్ జేసిన వానికి =
కొలువు జేతుమెగాని - ఇలను మరువక వాని - సిలువ మోయుచు నీ కృపా
= రక్షణ చాల విలువ గలదని చాటుచు ॥విజయ॥
- అల్లరి వెరవీరాస్వామి
Section: కక దైవస్తుతి · Book page: 54