Lyrics
రా - ఆనందభైరవి తా-ఆది
వందనమే యేసునకు - వరుసుగుణోదారునకు = సౌందర్య ప్రభువునకు
సర్వేశ్వర నీకు ॥వందనమే॥
1 యెహోవా తనయునకు - ఇమ్మానుయేలునకు = బహు కరుణాభరణునకుం
- ప్రభువుల ప్రభువునకు ॥|వందనమే॥
2. _ ఆశ్రిత జనపాలునకు - నకలుష వర దేహునకు = ఇశ్రాయేల్ రాజునకు -
యెహోవా నీకు ॥వందనమే॥
3. _ మరియాతనూజునకు - మహిమ గంభీరునకుం = పరిశుద్ధాచరణునకుం
'బరమేశ్వర నీకు ॥వందనమే॥
4. రాజులపై రాజునకు - రవికోటి తేజునకుం = పూజార్షపదాబ్దునకు
భువనావన నీకు ॥వందనమే॥
ర. (ప్రేమ దయా సింధునకు - క్షేమామృత పూర్ణునకు = ఆమే నని సాష్టాంగము
- లర్పింతుము నీకు ॥వందనమే॥
= వుడుషోత్తము చౌధరి
Section: కక దైవస్తుతి · Book page: 52