Lyrics
రా - శంకరాభరణము
దేవ కుమారా - దీనోపకారా = నా వంక దయం జూప - నా యన్న రారా
దేవ
1. వృక్షముం బాసిన - పక్షి నేనయ్యా = అక్షీణ కరుణచే - రక్షింపవయ్యా
భదేవ॥
2. పాపుల పాలిటి - పరమదయాళూ = దీవించు నీ దయ - దీనునికిపుడు
భదేవ॥
3... వినుతింతు సద్గుణ = విమల విచారా = నను ట్రోవవే యేసు - నామావతారా
భదేవ॥
4. భజనం జేసెద నిన్ను - నిజ రక్షకుండ = విజయము? జేయవే - నజరేతు
వాయదా ॥దేవా॥
5... కనికర మత్యంత - కరుణయుంగలదు = నిను నమ్ము వాని చే - తిని వీడ
వలదు ॥దేవ॥।
Section: కక దైవస్తుతి · Book page: 48