Lyrics
రా - శంకరాభరణము (చాయ: అన్నామన యేసు) తా-ఏక
పరమపురి కల్పభూజ - నిరత భూనరుల పూజ = యురుతరచిత మహిమతేజ
- వరస్తుతి సల్ఫెదము రాజ ॥పరమ॥
1. జనక సుత శుద్ధాత్మ - యను పేరిట యేకాత్మ = ఘనతర సంరక్ష (ప్రేమ -
ననిపి మము కనికరించు ॥పరమ॥
2. నీవే మా ప్రాపువంచు - నెరనమ్మి యుందు మంచు = భావంబున దలంచు
వారి - బావనులం జేయు సదా ॥పరమ॥
3. కలుషంబులను హరింప - నిల సైతానును జయింప = బలుమారు నిను
దలంచు - బలము గల ప్రభుండ వీవే || పరమ॥
4. ఈ లోక పాపనరులు - చాల నిను నమ్మి మరల = దూలిచే దారుణ సై -
తానును బడంద్రొక్మివేయు ॥పరమ॥
5. అల్బా ఓ మేగయును - నాద్యంతంబులును = కల్పాంత స్థాయువైన = కర్తా
కరుణించు మమును ॥|పరమ॥
= పాల యళోలు
Section: కక దైవస్తుతి · Book page: 44