Lyrics
రా - ఆనందభైరవి తా-ఆది
గొప్ప దేవ నాకు తండ్రివి - యాకాశమందు - గొప్ప దేవ నాకుం దండ్రివి
= తప్పకుండ వత్తు నీ - దరికి యేసు నామమందు - గొప్ప కరుణ చేత న -
న్నిప్పుడు తగం జేర్చుకొనుము ॥గొప్పు॥
1. నీవు మిగుల గొప్ప వాందవు - నా సృష్టి కర్త - యీవు లెపుడు నిచ్చు వాం
డవు = భావమందు నిను౭ దలంచి - పావనాత్మ నాకు నిచ్చి - జీవమార్గమందు
నిలిపి - కావు మనుచు వేండుకొందు ॥గొప్పు॥
2... చిన్నవాని నంగి ప్రార్థన - నీ లోకమందు - మున్ను దయను నిన్న వా౭డవు
= సన్సుతుండగు యేసు నీదు - సన్నిధి నున్నాడు గాన - నన్నుం గనికరించు
మనుచు - నిన్ను నమ్మి వత్తు నిపుడు ॥గొప్పు॥
3... విలువ గల్లు నీదు నాజ్ఞలు - నా హృదయమందు - బలు విధముల? దల౭
చు చుందును = బలుకులందుంబనులయందు - బలము జూపి నిన్ను
గొలిచి - యిలను నిన్ను ట్రీతిపరుతు - నలయక నీ కరుణ మెయిని ॥గొప్పు॥
4. మోంది రాజ్యమందుం జేర్చుము - కరుణాసముద్ర - బీద నైన నన్నుం
గరుణచే = సోదరులను గూడికొనుచు - మోద మొప్పంగ నీదు సేవం -
బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి ॥గొప్పు॥
- ఫలిపాక జగన్నూరము
Section: కక దైవస్తుతి · Book page: 42