FaithWalk
← Back to Songs

Song #46

ఉదయారాధన

రాగం: ఫీల్‌తాళం: రూపకము✍ మొలకాట్‌ విద్యానందము

Lyrics

రా- ఫీల్‌ తా - రూపకము

ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపంగా -

దేవా నేండు - శుభకాంతి విరజిమ్మంగా = విభవముగను ప్రభాకరముగను -

విరియు నీ తేజంబెలర్పంగ - నభి దనంబులంగూడి భక్తిని యాత్మతో

సత్యంబుతోదను ॥ప్రభువా॥

1. ఇరులుం గమ్మిననుండి - యరుణోదయము దనుక - నరిగాపు నీవే కాదా

- దేవా రాత్రి - యరిగాపు నీవేకాదా =విరివిగా మా హృదయసీమల - నెరసి

యుండిన చీంకటులుంబో -దరిమి శాంతంబైన మనసుల - దయంట్రసాదింపను

'భజింతుము ॥|ప్రభువా॥

2. అనఘానీ సాన్నిధ్య - మున నుండంగా మా దు - ర్మననుల నరి కట్టుమో

- దేవామా దు - ర్మనసుల శుచి జేయుము = వినయ భయ భక్తులుంద

లిర్చగ - వినుచు నీ వాక్యోపదేశము - లనిశమును ధ్యానింపనాత్మను -

'బనిచి తుదకుం బ్రసన్నమగుము ॥ప్రభువా॥

3... పనిపాటలలో మేమో - దినము నీ కే మహిమ నొనంగూర్చ నడిపించుమో

- దేవా నిన్నే - ఘన పరచన్నడిపించుము = తనువు శ్రమచేబడలినను మా -

దారి దుర్గమమైన కనంబడ - వనటంజెందక నేది జేసిన - బ్రభువు కొజకని

చేయ నడుపుము ॥ప్రభువా॥

- మొలకాట్‌ విద్యానందము

Section: కక దైవస్తుతి · Book page: 34