Lyrics
ప్రాతఃకాల కీర్తన
రా- బిలహరి తా- త్రిపుట
మేలుకొనరే మి మనంబుల - మేలిమిగ మో మేరం దప్పక = పాలు
'మాలక లేచి దేవుని - పాదములు పూజింప గ్రకున ॥మేలుకొనరే॥
1... దిక్కు లెల్లను దేజరిల్లైను - దినకరుం డుదయింపనయ్యెను = మొక్కులకు
ప్రతిఫలము నిచ్చెడు - మూల కర్తకు గొలువసేయంగ ॥మేలుకొనరే॥
2. పక్లు లెల్లను గిలకిలంచును - బ్రభుని మహిమలు బల్మం దొడలెను =
రక్షకుని సకలోపక్ళతులను - రమ్యముగ నుతియించి పాడంగ ॥మేలుకొనరే॥
3. నిదుర బోయిన వేళ మిమ్మొక - నిమిషమైనను బాసియుండక = పదిలముగ
రక్షించు దేవునిం - బ్రస్తుతింప మహాముదంబున ॥మేలుకొనరే॥।
4 మేటియౌ హృదయాజ్దములలో - మో కృతాజ్ఞతా భూషణంబులు = నేటుగా
ధరియించుకొని యిటు - నిర్మలాత్మునిం బూజసేయంగ ॥మేలుకొనరే॥
5... తెల్లవారంగం దెలియరే యిది - తెలివిగల మానవ సమాజము = యుల్లసిల్లుచు
నీతి భాస్మరుం - డుదయ మయ్యెను హృదయముల పై ॥మేలుకొనరే॥
- విక్టరి నమాయేలు
ఇ ఉదయారాధన
Section: కక దైవస్తుతి · Book page: 30