Lyrics
రా - ఆనందలైరవి తా-ర్ఫుంపె
మహిమ సర్వోన్నత - మైన దైవమునకి - మ్మహి సమాధానానుగ్రహము
గల్గున్రభో ॥|మహిమ॥
1... నిన్ను స్తోత్రించుచు - నిన్ను బూజించుచు - నిన్ను మహిమపర్చుచు -
న్నాము లోక ప్రభో ॥|మహిమ॥
2... ప్రభువైన దేవుండా - పరమండలపు రాజా - ప్రబలంబు గల తండ్రి
పరిశుద్ధంబగు ప్రభో మహిమ
3. వినయంబుతో నీదు - ఘన మహిమార్థంబై - వందనము లర్చించి విను -
తింతుము సత్యభో ॥మహిమ॥
4. _ జనితైక పుత్రుడగు - ఘన క్రీస్తేసు ప్రభు దే - వుని గొర్రెపిల్ల జనకుని
కుమారుడ ప్రభో ॥|మహిమ॥
5. ధర పాపములమోయు - వరపుణ్య శీలుండా - కరుణించి మా బీద
మొరలాలించుము ప్రభో ॥|మహిమ॥
6. _ తండ్రియైన దేవుని - దక్షిణ భాగమున గూ - ర్చుండి యున్నావు కృప
జూపుమి సత్రభో |మహిమ॥
7. పరిశుద్దుడవు నీవే - పరమ ప్రభుదవు నీవే - దురితాత్ములను గాన
మరణంబైతివి ప్రభో ॥మహిమ॥
8. పరమ జనకుని మహిమన్ - పరిశుద్ధాత్మైక్యంబై - సరణి మాకై యున్న
సర్వోన్నత ప్రభో 1మహిమ॥
- కేరాళ జాన్
Section: కక దైవస్తుతి · Book page: 22