Lyrics
(దావీదు కీర్తన 24)
రా - హరికాంభోజి (చాయః సఖులార సంఘంపుబడి) తా-ఆది
భూమండలము దాని సం - పూర్ణత యును లోకమును = భూమండల
వాసులను - బొల్పార యెహోవావే ॥భూ॥
1. యెహోవ సంద్రము మీంద - భూమి పునాది వేసె = మహాజలముల మీంద
- మనదేవుందది స్థిరపర్చె 1భూ॥
2. యెహోవ పర్వతమునకు - నెక్కంగం బాత్రు డెవండు = మహాలయంబునందు
- మరి నిల్వ యోగ్యుం డెవండు ॥భూ॥
3. అపవిత్ర మనసులేక - కపట ప్రమాణము లేక = సుపవిత్రమౌ చేతులను -
శుద్ధాత్మ గల్గినవాండే 1భూ॥
4 ఆలాటి వాండు ప్రభుని యాశీర్వచనము నొందు = భూలోకమున రక్షణ
దేవుని నీతి మత్వముపొందు ॥భూ॥
5. ప్రభునాశ్ర యించు నట్టి - వారు యాకోబు దేవ = ప్రభుసన్నిధానము
వెదకు - ప్రజలెల్ల రట్టివారే ॥భూ॥
6. ద్వారంబు లార యింక మీ తల లెల్లబైకెత్త వలెన్ = రారాజు కొరకుంతలుపు
- లారా మిమ్మెత్తుకొనుండి ॥భూ॥
7... ఇలలో మహా మహిమంబు - గలిగిన యీ రాజెవండు = బలశౌర్య
ముల యెహోవ - బహుశూరుడౌ యెహోవ ॥భూ॥
- మల్లెల దావీడు
Section: “9 దైవస్తుతి · Book page: 18