Lyrics
రా- కాంభోజి (చాయః యేసు నీ నామామృతము) తా-అది
త్రిత్వమై నిత్వత్వమున నే - కత్వమగు దేవా - నీ = సత్యసామర్థత్వముల
నిజ - తత్వము గణించి నిను నిత్యము స్తుతించెదను ॥త్రిత్వమై॥
1. ఎల్లలోకంబుల సృజించిన - చల్లని తండ్రి - నా = యుల్లమున నీ గొప్ప వింత
- లెల్ల సంతసిల్ల శో - భిల్లం దలంచెదను ॥త్రిత్వమై॥
2. వాసి కెక్కిన పరమరాజ్యని - వాసమును విడిన - శ్రీ = యేసునాధుం
డను కుమారా దోషుల దోసంబులెల్లం - గాచి రక్షించినావు ॥త్రిత్వమై॥
3. ఆదరణకారుండ వగు శు - ద్ధాత్ముడా దేనా - యా = మోద నామము
నంపంబడి యేను - నాధుని సుబోధ లెల్ల - బోధపరచి పాదుకొల్పు
॥త్రిత్వమై॥
4 ఓపితా సుతా శుద్ధాత్మ - ఒక్క దేవుండవు - ఎల్ల - పాపులను రక్షింప
మిగుల - నోపికతో నాపదలు - బాపి కృపం జూపినావు ॥త్రిత్వమై॥
“9 దైవస్తుతి
Section: a దైవస్తుతి · Book page: 16