Lyrics
(దావీదు కీర్తన 84)
రా - హిందుస్థాని ముఖారి తా-జుల్వ
(చాయః సాక్ష్యమిచ్చెద)
చూడ గోరెద - దేవ - మంది రావరణములను - చూడ గోరెద = చూడ
నాకు నాశ గలదు - సుంద రావరణము లవి = చూడ నాదు ప్రాణమెంతో -
సౌమ్మసిల్లుచున్నదహా ॥చూడ॥
1. నీదు నివాసములు జూడ - నెంతో రమ్యమై తనర = నాదు హృదయమునకు
నా - నంద మిచ్చు నిపుడు నెపుడు ॥జూడ॥
2. జీవము గల ప్రభుని జూడ - జీవి నాలో కేక చేసె = కోవెలలకు దొజికె
గూటి - తావు నీ మందిరమున ॥చూడ॥।
3. పిచ్చుకలకు దొజికె స్థలము - ముచ్చట బలిపీఠ మెదుట = పెట్టు
కుతూహలముతోను - పిల్లల నవి మందిరమున ॥చూడ॥
4. నీదు మందిరంబులోన - నిత్యవాసులైనవారు = నిక్కముగను ధన్యులగుచు
= నిన్ను నన్ఫుతింతు రహా ॥చూడ॥
5. ప్రభుని వలన బలము నొందు - ప్రజలు ధన్యులగుదు రిల = ప్రాణ
ప్రియము యాత్ర సేయు ప్రజల మార్గ మమర ధరను ॥చూడ॥
6. _ నీదు యావరణములలో - నేను నొక్క దినము గడుప = నెంతో విలువ గల
నాకు - వేయినాళ్ల బ్రతుకు కన్న ॥చూడ॥
7... కానరండు మనము నిపుడె - మనము లలర ప్రభుని జూడ = మందిరమున
కేగి నిండు - మనళ్శాంతి బొంది బ్రతుక ॥జూడ॥
-ఎం, జే రామాంజులు
Section: a దైవస్తుతి · Book page: 16