FaithWalk
← Back to Songs

Song #14

యెహోవా నా కాపరి

రాగం: సావేరి రా- త్రిపుట✍ మంగమూరి దేవడాను

Lyrics

(23-వ డావీదు కీర్తన)

రా-సావేరి రా- త్రిపుట

నాకేమి కొదువ - నాధుండుండ నింక = శ్రీకరుండగు దేవుండే నా -

జ్రేష్ట పాలకుండు - నా - యేక రక్షకుండు గనుక ॥నాకేమి॥

u దైవస్తుతి

1... తనివి దీరజ మే-ళ్లనుభవింప - నేను = నను సదా మేళ్లనెడి పచ్చిక -

నదిమి మృదువుగం - బిందు - కొనంజేయును గనుక ॥నాకేమి॥

2... ఎంత శోధన - యెండ యున్న - నాకు = నెంతకు నోరిగర దెపుడు -

శాంత జలములు - నా చెంతనే యుండు గనుక ॥నాకేమి॥

3. తప్పిపోయిన నన్‌ - దారిం బెట్టి - నన్ను = తెప్పరిల్లంజేసి నాకు దీరు

'నలసటను - నా - తప్పు మన్నించున్‌ కనుక ॥నాకేమి॥

4. నీతి మార్గమునన్‌ - నిల్పున్‌ నన్ను - ప్రభువు = నీతి లేని నాకుం దనను

- నీతి దయ చేయున్‌ - స్వ - నీతిని ద్రుంచున్‌ గనుక ॥నాకేమి॥

క్‌. చావు చీంకట్ల - శక్తియుండు - ఆహా = లోయలోంబడి పోవలసినను -

నే వెరవకుందు - నా - దేవుండే తోడు గనుక ॥నాకేమి॥

6. మీందంబడునట్టి - శోధనలన్‌ - ధరను = నా దరికి రానీక దండము -

నన్ను ట్రోచుచును - నా - కాదరణ యౌను గనుక ॥నాకేమి॥

7. పగవారల్‌ సిగ్గు - పడునట్లుగ - నా =జగము యెరుంగని సౌఖ్యభో జన

మగపరుచును - హా - తగినదే పెట్టున్‌ గనుక ॥నాకేమి॥

8. తన యాత్మానంద - తైలంబుతో - (ప్రభువు = ననుదినము తలయంటి

విసుగ - కొనక తుడుచును - నా కన్నీళ్లన్ని గనుక ॥నాకేమి॥

9. పలువిధములైన భాగ్యములతో - తండ్రి = వెలుపలికి దిగవెడలునట్టి -వెల

గల గిన్నె - నా కలిమిగాం జేయున్‌ గనుక ॥నాకేమి॥

10. ట్రదుకంతటన్‌ గృ - పా క్షేమములు - నా = వదలకుండగ వచ్చు

నాతో - సుదినములు గల్ల - నా - పదలు సంపదలొ గనుక ॥నాకేమి॥

11... దురితంబు లుండు - ధరణి నాకు నిజము = నిరవు కాందిక నెప్పటికి

నా = పరమ దేవుని - మం - దిరమె నా యిల్లు గనుక ॥నాకేమి॥

= మంగమూరి దేవడాను

Section: దైవావాధన 4 · Book page: 10