Lyrics
రా - శంకరాభరణము (చాయ: మన మొదటి తలిదండ్రుల్) తా - త్రిపుట
నా కాలగతు లెవ్వి - నా చేతులను లేవు - నాదు దేవ = యెపుడు - నీకే
వాని మీద = నిత్యాధికారంబు - నిల్చియుండు ॥నా॥
1. తల్లిగర్భంబున - దసర సృజించితివి - ధరణి నన్ను = నీవు - తల్లికన్నను
మిగుల - దయచేతం జూచితివి - తండ్రి నన్ను ॥నా॥
2... పాప కూపమునందుం - బడియుండంగా నన్నుం - బారంజూచి =
చేయి - చాపి యేసునిద్వార - చక్కంగాందెచ్చితివి = చాలు దేవ ॥నా॥
3. _ సుఖఃదుఖ కాలములు - శోధింపం - బంపుదువు - శోభాయుక్త = నాకు
- సుఖముం గల్గజేయు - సొంపుగ వానిచే - స్టూల శక్తి ॥నా॥
Section: దైవావాధన 4 · Book page: 10