Song #8
యేసు సహాయమునకై ప్రార్థన
Lyrics
రా- మారువ (ఛాయ : తనువు నాదిదిగో) తా-ఆది
యేసు నాయకుండ -యెల్ల వేళలను నీ - దాసుల నేలుమయ్యా = మోసము
అన్నిటి = మునగంద్రోతునని - బాసలు జేసిన - ప్రభుండవు నీవెగా॥యేసు॥
1... రేయింబవలు మా - న్యాయము చెరిపెడి - మాయ పిశాచిని = త్రోయుమి
దూరము -బాయక భక్తుల - చేయి విడువని బహుశ్రేష్టుండ నీవెగా | యేసు॥
2. హృదయము లోకము - మది పాపము మమ్ము - సతతము శ్రమ పెట్టును
= సదయుండ మమ్మును - వదలక నిత్యము - మది తలపులలో - మహిమగ
నేలుమీ ॥యేసు॥
3. కాపాడుమి మమ్ము - మాపు రేపు నీ - శ్రీ పాదము లొద్దను = ఏ
'పాపములును ఏలకుండగ నీ - ప్రాపునంబెంచుము - మాపాలకుండవో ॥యేసు॥
4. మాకొరకై నీ - మేనును మ్రూనున - మేకులతోంగొట్టగ - మానము మహి
మలు - మనుజుల కియ్యను - భానుండ రాజుగ - బ్రతికిలేచితివి ॥|యేసు॥
5... చెజను చెజనుగా - మరి పట్టుక నీవు - పరమున కరిగితివే - వరముల
నిడితివి - ధరలో నరులకు - పరముండ నీ దయ మరువశక్యమా ॥యేసు॥
- గా్లవల్లి నతానియేలు
Section: దైవావాధన 3 · Book page: 2