Song #2
దేవుడు సర్వస్తోత్ర పాత్రుడు
Lyrics
రా - ఆనందభైరవి (ఛాయ : యెహోవ భజన) తా - త్రిపుట
గానముం జేయుండు సుకీర్తనను = యెహో - వాను గూరిచి క్రొత్తం -
గాను రక్తిగను ॥గానము॥
1... తన్నామము నుతించి యతని - రక్షం - జెన్సుంగ సారెం బ్ర - సిద్ధముం
జేసి = పన్నుగ నన్యులలో దన్మహిమ - యం - దున్నత చిత్రము - లను
'జాటండి ॥గానము॥
2. ఘనతయు మహత్యమును - ద -ద్దనని యెదుటనుండు - ఘనబలమును=
వినతమౌ సౌందర్యమును - న - తనివి నిర్మల స్థల -మున విలసిల్లు ॥గానము॥
3... పరిశుద్ధాలంకారముతో - నా - పరమాత్మారాధన - పరులై యుండండి =
ధరణి సకల జనులారా - లోక - గురుని యెదుట భీతి - గొనుచు నుండండి
॥గానము॥
4 పరిపాలించుచున్నాం డనుచు తోడి - నరులతోం జెప్పుండి - ద్ధరం గదకుండ
= స్థిరముగం జేయు సత్యముగా - జనుల - కరిమురిగాను న్యా - యము
విమర్శించు ॥గానము॥
5... ఏమనిన నా మహాత్ముండు - వచ్చు - నీ మహికి న్యాయము - నేర్పరచు
టకు = భూమి జనులకు నీతి సత్య - ముల - తో మించు న్యాయ మెం - తో
విమర్శించు ॥గానము॥
జనులారా యా యెహోవాకు - మహి - మను బలమును సమర్పణము
జేయండి వినయముతోం గానుకలను - తీసి - కొని తత్రాకారమందున
వసియింపండి ॥గానము॥
- విలియం దానర్
Section: దైవావాధన 3 · Book page: 2