Lyrics
రా - కాంభోజి తా-ఆట
అన్ని కాలంబుల - నున్న యెహోవా ని - నెన్నందరంబియో - కన్న
తండ్రి - వన్నె కెక్కిన మోక్ష - వాసాళి సన్నుతు - లున్నతమై యుండ -
మున్నె నీకు ॥నన్ని॥
1. నిన్నుం బ్రకటన సేయ - నిఖిల లోకములను- బన్నుగం జేసిన - బలుండ
వీవె = ఉన్న లోకంబుల - నుడుగక కరుణా సం-పన్నతతో నేలు -
ప్రభుడ వీవె = అన్ని జీవుల నెజింగి - యాహార మిచ్చుచు - నున్న సర్వజ్ఞం
- డవు నీవే = ఎన్న శక్యముగాక - ఉన్న లక్షణముల - సన్ఫుతించుటకు
నేం - జాలుదునా ॥యన్ని॥
2. _ పుట్టింప నీవంచుల - బోషింప నీవంచుల-గిట్టింప నీవంచు - గీర్తింతును
= నట్టి పనికి మాలి - నట్టి మానవుల చే - పట్టి రక్షింప బా-ధ్యుండ వంచు
దట్టమైన కృపను దరింజేర్చ నాకిచ్చి - పట్టయి నిలచియుండు - ప్రభుండ
వంచు = గట్టడచేం గడ - ముట్టుదనుక నా - పట్టుకొలంది నిన్ను: - బ్రస్తు
తింతు ॥నన్ని॥
3. _ కారుణ్యనిధి వీవు - కఠినాత్ముండను నేను - భూరి శుద్ధుండ వీవు - పాపి
నేను = సార భాగ్యుడ వీవు - జగతిలో నాకన్న - దారిద్రుండే లేండు -
తరచి చూడ = సార సద్గుణముల - సంపన్నుండవు నీవు - ఘోర దుర్గుణ
'సం- చారి, నేను = ఏ రీతి స్తుతియింతు - నే రీతి సేవింతు - నేర మెన్నక్ష
ప్రోవ - నెర నమ్మితి ॥నన్ని।
= కోల జార్
Section: దైవస్తుతి · Book page: 2