FaithWalk
← Back to Library

#96యేసుక్రీస్తు దేవుడు

Author: ఎ.బి. మాసిలామణిCategory: సాయంతనారాధన
1.
దేవుని నీతి ప్రతాపం – భువి యేసుని సిలువ ప్రభావం దేవుల దేవుని అపూర్పం – భువి యేసుని నామ స్వరూపం దేవ యెహోవ సువాక్యం – సౌభాగ్యం – దేవ జనుల హృదయానందం
2.
||యేసు క్రీస్తు దైవ సుతుడు – యేసుక్రీస్తు మనుజసుతుడు – యేసుక్రీస్తు దేవుడు – యేసే ప్రభువు – స్తుతి పాత్రుడు ||
3.
ఆద్యంత రహిత కీర్తి అవతార శ్రమార్జనమూర్తి ఆకాశ రాసుల ఆదిపతి – అవని సృజనాత్మక ప్రతీతి అఖిల ప్రపంచ ప్రదాత – అధినేత – అనుదిన కృపాలిడు సుఖదాత
4.
పాపము భయపడు నామం పాపాత్ముడు కృపగను హోమం పతితుల వెదకిన ప్రేమస్వరం పరలోక సుఖాల విహారం పాప క్షమాపణ గానం – బహు – అనవరతము నిజబలిదానం
5.
జనుల జీవాధిపతి – జగమంతటి నేలెడు జ్యోతి జీవుల అంతిమ న్యాయపతి జీవాత్మలు క్రోలెడి నీతి జనన మరణ జయశీల – నరపాల – జగతిని మార్చెడి శుభజ్వాల