#95క్రీస్తు దైవత్వము
Author: గొల్లపల్లి నతానియేలుCategory: సాయంతనారాధన
ప
యేసు క్రీస్తుడు నిత్య దేవుడు – ఎరిగి నమ్మండి మనుజులారా
మోస మొందక మోక్షపతికింక – దాసులై – బ్రతుకండి రండి ||యేసు||
1.
ఆరు దినములలోపలనే – ఆకాశము భూలోకములను – ప్రకటముగ జేసినాడు – ప్రకాశుడాయన ప్రజ్వలింతుడు ||యేసు||
2.
ఆది పురుషుని యాదిసృష్టింక – హస్తములతోనంటి చేసెను – మేదినిన్ ఫలవనములోన – సాధులై నివసింప నిచ్చెను ||యేసు||
3.
వారలిద్దరి దేవునాజ్ఞను – కోరికలతో మీరినప్పుడు – గారడీ పిశాచ తంత్రము – వారి పరమై పాపులైరి ||యేసు||
4.
వీరలందరూ వారి సంతతి – వేరులేరీ ధరణిలో దు – ష్కార్యులై దేవుని యాజ్ఞలు – మీరి రందరు నరక పాత్రులు ||యేసు||
5.
ఇంత పాపభరితులైకా – సంత సత్యము లేని నరుల – నేంతగానో ప్రేమించెనో తన – సొంత ప్రాణము బలిగ బెట్టెనట్లు ||యేసు||
6.
పాపమించుకలేని కరుణా – పావనుడు నరుడాయెను – శాపగ్రస్తులమైన మన – శాపములు తానే చేతబూనెను ||యేసు||
7.
ఎన్నరాని బాధలొందుచు – పుణ్యరక్తము చిందినలను – ఎన్నడూ నీలాటి ప్రేమ – వన్నెలేదు యన్నలారా ||యేసు||
8.
మనల పాపమునుండి బాపను – మనుజుడై మరణంబునొంది – మన ప్రభువు మూడవ దినంబున – మహిని లేచి పరము వెళ్ళెను ||యేసు||