#88యేసును స్తుతించుట
Author: ఇ.జె. ఆనందముCategory: సాయంతనారాధన
ప
నమో యేసునాథా – నాథా – నమో జీవనాథా
సమాన విరహిత సనాతనాత్మా – సమున్నతోజ్వల ప్రశాంత ధామా ||నమో||
1.
స్థావర జంగమ జగమందున నీ శక్తి స్వరూపము ప్రతిఫలింపగా – భూవలయాకాశంబుల మించుచు – భువన పాలనము చేసెడి ప్రభువా ||నమో||
2.
ధరణి మానవ విమోచ నార్థము – కరుణను జీవము లొసగిన ప్రభువా – పరమ కృపాభరితామృతసారా వరసజ్జన హృదయాబ్జ విహారా ||నమో||
3.
సుందర మలయజ గంధ ధూపముల – చందముననుమా వినుతులు గొనుమా – వందే దేవ దయాసందీప – వందే శుభదానంద స్వరూపా ||నమో||