FaithWalk
← Back to Library

#84నీతి సూర్యుడు

Author: చెట్టి భానుమూర్తిCategory: సాయంతనారాధన
ప
ఇదిగో నీతి భాస్కరుండు – ఉదయమాయె నతని నీతి హృదయ కమలములను నిలిచి మది తమో గుణంబులను బాపి – సదమల జ్ఞానంబు నొసగ ||ఇదిగో||
1.
ఎవని జ్ఞాన మహిమ విభవ – మెవని నీతి బల ప్రకాశ – మెవని మనుజ రూపమాయె – నవవినీత సత్యవర్తి – రవిని మించు తేజమూర్తి ||ఇదిగో||
2.
నరజనముల నీతియెవడో – ధరణిపతుల దీప్తియెవడో – దురిత భవనము దీర్చునెవడో – పరమపురుషుడు యేసుడతడే – నిరత జీవమొసగు నిప్పుడే ||ఇదిగో||
3.
కలుషమెల్ల బాపదలచి – కల్వరి గిరివరకు నడచి – అలవికాని ముక్తి గూర్చన్ – సిలువమీద బలియై మరణ – బలమునణచి తిరిగి లేచే ||ఇదిగో||
4.
మదితమము భేదకటకరిగి – యెదను కీర్తనము కరిగి – హృదయ రసము అతిశయించి – సాధు గుణము కలిగి యేసు – పాదములను గొలుతు నిప్పుడే ||ఇదిగో||
5.
జనగణముల జీవమతడే – ధన ఘనముల దాతయతడే – అనుభవమున నెరుగుమతని – అనుపమ ప్రేమామృతంబు – అనవరత ఆనందకరము ||ఇదిగో||