FaithWalk
← Back to Library

#83క్రీస్తును చూడ రండి

Author: UnknownCategory: సాయంతనారాధన
ప
రారే మన యేసు స్వామిని – చూతము కోర్కెల్ తీర – ప్రియులారా ప్రేమిని గూరిమి భక్తుల విందుగా – భూరి దయామృత సారము ఒలికెడు చారు కటాక్ష వీక్షణలు గలవానినట – నరనారీ జనులకు – దారకమై వెలయునట – దాని పిలుచునట – దారుణ పాప హరణ్యమునకు – గారూచిచ్చు గతి గనపడు వాడు అట ఘోర దరిద్రత – గూల్చెడివాడట – సారంబగు తన – సభకు ముకుటమట ||రారే||
1.
పతిత పావనమౌ వేల్పు అట – అనాది దేవ – సుతుడై ఇల జేరినాడట – సతతము కడు దురిత – తతమో యుతమగు – ప్రతి దేశమునకు – హిత భాస్కరుడట – అతులిత మోక్షోన్నత గుణగణ్యుడట – కుతలంబున సద్గతి రహితంబగు – పతితులను గావను – మృతుడైనాడట – అతిపుణ్య తన – క్షత శోణితమును – వ్రతముగ సిలువను – నటుడొసంగెనట – మృతిని జయించుచు – బ్రతికి లేచెనట – మతి నమ్మిన మన – గతి యితడేనట ||రారే||
2.
తుదిలేని మహిమవాడట – తనను గొల్చు సాధు – హృదయుల సొమ్ము మూట అట – చెదరిన గొర్రెలను – వెదక వచ్చెనట – చిదురుపలగు జన హృదయములన్నిట – భద్రముగా నెమ్మది నిడువాడట – నదితట మర జన – వదనముల సమ్మద శుభవార్తను – బలికినవాడట – సదయుడై గ్రుడ్డిల – కన్నుల నిచ్చెనట – వెదకి బధిరులకు – విను – ఒసగెనట – సదమల మోక్ష – ప్రదాతయగు విభుడట – ఇదిగో మన హిత – డెలిసినవాడట ||రారే||