FaithWalk
← Back to Library

#82యేసు నామ భజన

Author: ఐగిరాల గాబ్రియేలుCategory: సాయంతనారాధన
ప
యేసు భజన సేయవే – దోషపు మనసా! వాసిగ నేనే, వర రక్షకుడు – వేసారి వసుధ – నీ వాడనై గానము ||యేసు||
1.
ధారుణి పాప – భరణా! హరణా! – కారుణ్యకరాయని కోరి భజింపవే ||యేసు||
2.
శాంతి సునీతి – సదమల భక్తిని – వింతగ నిడు మన – శాంతి సుధాకరు ||యేసు||
3.
అన్నపూర్ణా! నీవే – అవని తలంబున – నన్ను గనుగొంటివి – నా ధనమంటివి ||యేసు||
4.
మనసా! నీదు – మలినంబును తాను – మనుగడ, సిల్వపై – మా ప్రేమ హృదయుడు ||యేసు||