FaithWalk
← Back to Library

#766వరనామమే యేసు వరనామమే శుభనామమే క్రీస్తు శుభనామమే వరనామమే శరణు వరనామమే శుభనామమే శరణు శుభనామమే

Author: బిషప్ దైవాశీర్వాదం గోవాడCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
వరనామమే యేసు వరనామమే శుభనామమే క్రీస్తు శుభనామమే వరనామమే శరణు వరనామమే శుభనామమే శరణు శుభనామమే
1.
ఉన్నాను అనువాడు వరనామమే ఎన్నడూ మారడు వరనామమే దేవుడు మనతోడు వరనామమే నిన్న నేడు ఎప్పుడు వరనామమే ||వర||
2.
సర్వశక్తి దేవ వరనామమే చూచుచునున్న దేవ వరనామమే సైన్యముల అధిపతి పరనామమే ఆద్యంతముల కాంతి వరనామమే ||వర||
3.
దయాసముద్రుడు యేసు వరనామమే పరలోక తేజస్సు వరనామమే నీతి సూర్యుడు యేసు వరనామమే సాటిలేని యేసు వరనామమే ||వర||