#760సమృద్ధి జీవమా – సంపూర్ణ ప్రేమయా సజీవ వాక్యమా – మా యేసు దైవమా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా
Author: వెరి. రెవ. జి.ఎస్. సువర్ణరాజుCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
సమృద్ధి జీవమా – సంపూర్ణ ప్రేమయా సజీవ
వాక్యమా – మా యేసు దైవమా హల్లెలూయా – హల్లెలూయా
హల్లెలూయా – హల్లెలూయా
1.
తీరని వ్యాధితో – దరినెవరూ లేక
మారని వ్యధలతో – నిరీక్షణ లేమితో
కరుణామయు దరిని – కనుగొంటివి నన్ను
مరణము బాపి – జీవము నిచ్చితివి ||సమృద్ధి||
2.
పాపపు దాహముతో – లోకపు మోహములో శాపమే
జీవితమై – ముఖము చూపలేక తాపపు వేళలో – బావికి పరుగెడి
ప్రభునే గాంచి – జీవజలం పొందితి ||సమృద్ధి||
3.
అంధుడనైతినే – చీకటి బ్రతుకులో వీధుల తిరుగాడితి
– జీవన లేమితో పరిపూర్ణ ప్రేమతో – కరమును చాపి
వెలుగును నొసగి – జీవమునిచ్చితివై ||సమృద్ధి||
4.
ఎంతో వ్యయపరచితి – స్వస్థత
నొందుటకై చెంతకు రారెవరూ – నా స్థితి గమనించి కరుణామయుని – చెంగు
ని తాకి
వింతను గాంచితి – నవజీవ మొందితి