#759దినమంతా ప్రభు స్తుతియింతు అనయము యేసుని భజియింతు అనిశము దేవుని ఆరాధింతు – 2 తనువు మనసు అర్పణచేతును ||దిన||
Author: UnknownCategory: లంబాడ / గిరిజన కీర్తనలు
ప
దినమంతా ప్రభు స్తుతియింతు
అనయము యేసుని భజియింతు
అనిశము దేవుని ఆరాధింతు – 2
తనువు మనసు అర్పణచేతును ||దినమంతా||
1.
నా అంతరంగమా – నా
సమస్తమా పరిశుద్ధ దేవుని స్తుతియించుమా
ఆయన చేసిన ఉపకారములను
– 2
దేనిని నీవు మరవకుమా – 2 ||దినమంతా||
2.
నీ దోషముల క్షమించు
వాడు నీ సంకటములు తానే కుదుర్చున్
నా ప్రాణమును మరణము నుండి – 2
తానే తప్పించి, విమోచించువాడే – 2 ||దినమంతా||
3.
నీ ప్రార్థనలకు చెవియొగ్గువాడు
నీ మొరలను తానాలకించును
నీ శ్రమలన్నిట ఆసన్నుడుగా నిన్ను కాపాడును
కరుణించున్ ||దినమంతా||