FaithWalk
← Back to Library

#716మందార మకరంద మాధుర్యమున

Author: ఆచార్య ఆర్.ఆర్.మూర్తిCategory: రెండవ అనుబంధము
ప
మందార మకరంద మాధుర్యమున తేలు – మధుపమా నా హృదయమా
1.
యేసు పదముల వ్రాలి – అమృతధారను గ్రోలి – ఆనందమున తేలుమా (2) పరమ సింహాసనముపై కెగిరియుమా ||మందార||
2.
నిర్మల మందాకిని వీచికలో తూగు (2) రాజహంసా నా మానసా హంసాయేసు వాక్య తరంగ, డోలికపై ఊగి హాయిగా విహరింపుమా – మోక్ష సంధాయకుని వరియించుమా ||మందార||
3.
లలిత రసాల పల్లవా – ఖాదియై వెలుగు కోయిలమ్మ – హృదయ విహంగమా – యేసు తరు శాఖపై – ఏపుగా కూర్చుండి – జీవ ఫలములను – భుజింపుమా – రక్షకుని ప్రేమ శృతి పాడుమా ||మందార||
4.
పూర్ణేందు చంద్రికా స్ఫురితమై వెలుగొందు – చకోరమా – నా జీవనా పతాకమా – యేసు వెలుగులు చిందు – భాసురంబగు విందు పరమార్ధమునూ చూపెనే – వెన్నెల – కరుణామృతము కురిసెనే ||మందార||