FaithWalk
← Back to Library

#715తంబుర నాద స్వరముల తోడ

Author: ఆచార్య ఆర్.ఆర్.మూర్తిCategory: రెండవ అనుబంధము
ప
తంబుర నాద స్వరముల తోడ తగు విధి నిన్ను భజన చేతు అంబరంబున కెగసే పాటలు హాయిగ పాడెద పాడెద
1.
సితార స్వర మండలములతో – ఈశ్వర నిన్ను భజన చేతు – ప్రతిదినమున నీ ప్రేమ గాథను – ప్రస్తుతించి పాడెద పాడెద
2.
మృదంగ తాళ ధ్వనులతో – మృత్యుంజయు నిన్ను భజన చేతు – ఉదయ సాయంత్రముల యందు – హొసన్నా యని పాడెద పాడెద
3.
పిల్లనగ్రోవిని చల్లగనూది – వల్లభ నిన్ను భజన చేతు – వల్లభుడన నా ఎల్లవేళల – హల్లెలూయా యని పాడెద పాడెద