FaithWalk
← Back to Library

#714యేసుని వదనము అందమని

Author: ఆచార్య ఆర్.ఆర్.మూర్తిCategory: రెండవ అనుబంధము
ప
యేసుని వదనము అందమని – యేసుని వచనము మధురమని – యేసుని చరణమే శరణమని – యేసు చెంతకు వచ్చితిని – హల్లెలూయా... (4) హల్లెలూయని పాడితిని
1.
యేసుని సిలువే విలువయని – యేసుని రక్తమే విజయమని – యేసే పునరుత్థానమని – వాసిగ యేసుని నమ్మితిని ||హల్లెలూ||
2.
పాపిని నన్ను రక్షించెనని – శాపము బాపిన దేవుడని – పరమునకు నన్ను చేర్చునని త్వరపడి యేసును చేరితిని ||యేసు||