#713యేసు ప్రభు నీ చరణం
Author: ఆచార్య ఆర్.ఆర్.మూర్తిCategory: రెండవ అనుబంధము
ప
యేసు ప్రభు నీ చరణం నా ఆత్మకు శరణం ||యేసు||
1.
నీ ప్రేమ కథా శ్రవణం నీ శుభ నామ స్మరణం – నా జీవన తరుణోపాయం
నా యాత్రకు నిరుపాయం ||యేసు||
2.
నీ దివ్య సిలువ మరణం నా నవ్య జీవ కిరణం – నీ శాంతి కాంతి నిలయం
– నా హృది నీ దేవాలయం ||యేసు||