#707దేవా నేను నీవాడను
Author: రెవ. కొంగర సామ్యేల్ సంజీవిComposer/Ragam: ఛాయ: నేను నీ వాడను దేవాCategory: రెండవ అనుబంధము
ప
దిక్కంబిగ దేవా వేడుచునుంటిమి – స్త్రీల మైత్రిని దేవా వర్ధిల్ల చేయు
మీ
1.
స్త్రీ మైత్రిలో చేరు స్త్రీల నందరి కృపతో చాలా దీవెనలిచ్చి చక్కగా నడిపించు ||దేవా||
2.
ప్రార్థనలయందు – ప్రభువు సేవయందు సార్థకముగా నీకై సాక్ష్యమిచ్చుట
యందు ||దేవా||
3.
మాటయందును మరియు – మేటి కార్యములందు తేట క్రైస్తవ బ్రతుకు –
చాటి చూపుట కొరకు ||దేవా||
4.
పరిశుద్ధ వివాహ పవిత్రతను ఎరిగి మరణాంతమగు దనుక స్థిరముగా
జీవించ ||దేవా||
5.
పిల్లలందరిన్ ప్రభు భయమునందున బెంచ తల్లులందరి కెప్పుడు – తగు
సాయమియ్యను ||దేవా||