FaithWalk
← Back to Library

#706స్త్రీల మైత్రి

Author: రెవ. కొంగర సామ్యేల్ సంజీవిComposer/Ragam: ఛాయ: మద్యపానము దరికి పోకండిCategory: రెండవ అనుబంధము
ప
స్త్రీల మైత్రిలో చేర రారమ్మ–శ్రీ యేసుప్రభుని శ్రేయము చెప్పగ కొలువ రారమ్మ స్త్రీల సేవను ప్రేమతో గొని చాలా దయతో చేర దీసి మేలు చేసి యాదరించిన యేసు పేరిట సేవచేయును ||స్త్రీల మైత్రితో||
1.
భక్తురాలండ్రగు స్త్రీల పరిచర్యన్ – ప్రభు యేసు ధరణిలో మక్కువ తో అంగీకరించెనుగా శక్తి గల యా రక్షకుడు – ఎక్కువగ యాదరణ చూపి తక్కువగు మన స్త్రీల స్థితినిల యుక్తముగా బహు యుద్దరించెను ||స్త్రీల మైత్రితో||
2.
స్త్రీలు అందరూ సేనగా చేరి – స్థిరమైన మైత్రిలో – మేలుగా రక్షకుని గొనియాడె – వీలుగా మన దేశమునకు పాలు మాలక సేవ చేసి – చాలగా మన యేసు ప్రేమను చక్కగా ప్రత్యక్షపరచును ||స్త్రీల మైత్రిలో||
3.
దక్షిణ ఇండియా సభలో ఉన్నట్టి – స్త్రీలంత గూడి – ఏకమగు సహవాసమందుండి – దీక్షతో ప్రార్థనల యందు – సేవ యందు సాక్ష్యమందు – రక్షకుండగు యేసు శక్తిని స్పష్టముగా నిలచాటి చూపక ||స్త్రీల||