FaithWalk
← Back to Library

#705యేసుప్రభువు సిలువ మీద

Author: రెవ. కొంగర సామ్యేల్ సంజీవిCategory: రెండవ అనుబంధము
ప
యేసుప్రభువు సిలువ మీద – ఏడుమార్లు – ఆశతోడ పల్కెను – భాసురంపు పల్కులు – దాసజనులు తలపోయ దండి ధైర్యమిచ్చును
1.
తండ్రి వీరు చేసేదేమో – తెలియకున్నారు – దండించ వద్దని దయతోడ వేడెను – నిండు జాలి శత్రువులపై మెెండు తాల్మి చూపెను
2.
చూడు నీవు పరమునందు – నేడే యుందువు తడువలేక నాతోడు – అని తెల్పె దొంగతో కడు దీనత వేడ పాపిని కరుణ తోడ కాచెను
3.
అమ్మా ఇదిగో నీ కుమారుడంచు తల్లితో నెమ్మమితో యోహానును – నమ్మకంపు – శిష్యుని – ఇమ్ముగా మరియమ్మ తల్లిగా – సమ్మతితో చూపెను
4.
చెప్పరాని తాపమొంది గొప్ప బాధచే – దప్పిగొనుచున్నానని దండి కేక వేసెను – దప్పి బాధ తీర్చలేక చేదు చిరక నిచ్చిరి
5.
నాథా దేవా నాదు చెయ్యి – నేల విడిచితి – నన్నేల వీడితివని కేక వేసెను బాధలెంతొ హెచ్చుకాగా బహుగా విలపించెను
6.
సకల వరుల రక్షణంబు – సిలువ యందున – సమకూడె గావున – స్వామి యొక్క కార్యము – ఇక సమాప్తమైనదంచు వీకతో ప్రకటించెను
7.
తండ్రి నాదు ఆత్మ నీకు నిండు ప్రేమతో అప్పగించుచున్నానని చెప్పి ప్రాణం వీడె ను – మెెండు శాంతి తోడ యేసు మెెల్లగా నిద్రించెను