FaithWalk
← Back to Library

#694స్తోత్రం చెల్లింతుము - స్తుతిస్తోత్రము చ

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
స్తోత్రం చెల్లింతుము – స్తుతిస్తోత్రము చెల్లింతుము యేసునాథుని మేలులు – తలంచి (2) ||స్తోత్రం||
1.
దివారాత్రములు కంటిపాపవలె కాచి (2) దయగల హస్తముతో – బ్రోచి నడిపించితివి (2) ||స్తోత్రం||
2.
గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృశించిపోనీయక – కృపతో బలపరచితివి ||స్తోత్రం||
3.
సజీవయాగముగా – మన శరీరము సమర్పించి సంపూర్ణ శుద్ధినొంద – శుద్ధాత్మను నొసగితివి ||స్తోత్రం||
4.
సీయోను మార్గములో పలుశోధనలు రాగా సాతాన్ని జయించుటకు – విశ్వాసము నిచ్చితివి ||స్తోత్రం||
5.
సిలువను మోసుకొని సువార్తను చెప్పి యేసుని వెంబడింప – ఎంత భాగ్యము నిచ్చితివి ||స్తోత్రం||
6.
పాడెద హల్లెలూయా – మరనాత హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా – ప్రభు యేసుకు హల్లెలూయా ||స్తోత్రం||