#693స్వచ్ఛంద సీయోనువాసి - సర్వాధికారి కస్తూర
Author: UnknownComposer/Ragam: చేయువాడుCategory: రెండవ అనుబంధము
ప
వర్తమాన భూత భవిష్యత్కాలవాసి – ఆల్ఫా ఓమెగా
తానే – ఆద్యంతము మన యేసే ||స్వచ్ఛంద||
1.
ఇదిగో నేనొక నిబంధనను – అద్భుతముగా జేతున్ నీ ప్రజలందరి యెదుట – పరిశోధింపజాలని మహా – పనులల్లా
ప్రభు – వే – లెక్క లేని అద్భుతములు – మక్కువతో
2.
సంగీతనాదములతోడ – సీయోనుపురము –
సొంపుగాను చేరితిమి శాశ్వత సంతోషము – మా శిరములపై వెలిసెన్ –
దుఃఖము నిట్టూర్పును పోయెన్ – మిక్కిలి ఆనందము కలిగెన్ ||స్వచ్ఛంద||
3.
నీలముల పునాదులు వేసి – నీలాంజనములతో
మాణిక్యమణులతో – సువర్ణ సునీయములతో సూర్యకాంతులతో – ప్రశస్త రత్నములతో
ప్రవిమలముగా – నిను
కట్టెదను ||స్వచ్ఛంద||
4.
సుమముల హరము – సంతోషానంద తైలము
నీవే స్తుతి వస్త్రమును నీ – వే – ఉల్లాస వస్త్రంబు
నీవే విడుదలయు నీ వే – హితవత్సరము విముక్తి
ఆత్మాభిషేకము నీ
వే ||స్వచ్ఛంద||
5.
జలములలో పడి దాటునప్పుడు బలమై యుండెదను నీతోడై యుండెదను – నదులలో పడి వెళ్ళునప్పుడు నీపై పారవు
– అగ్ని మధ్యను నడిచినను జ్వాలలు నిన్ను
కాల్చలేవు ||స్వచ్ఛంద||
6.
ఇత్తడి తలుపులు – పగులగొట్టెద – ఇనుప
గడియలను విడగొట్టెద నేను – అంధకారస్థలములలో నున్నట్టి నిధులు
రహస్యములో
మరుగైన – ధనమును నీ కొసంగెదను ||స్వచ్ఛంద||
7.
గర్భమున పుట్టింది మొదలు – తల్లి
ఒడిలోన కూర్చుండింది మొదలు – నేను చంక పెట్టుకొన్న నాదు ప్రజ
లారా – ముదిమి వచ్చు
వరకు నిన్ను – ఎత్తుకొనువాడను నేనే ||స్వచ్ఛంద||