FaithWalk
← Back to Library

#689హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయయని పాడెదను ఆనందముతో నేను సాగెదను
1.
సర్వకృపానిధియగు ప్రభువా – సకల చరాచర సంతోషమా స్తోత్రము చేసి స్తుతించెదవు – సంతోషముగా నిన్ను పొగడెదము ||సర్వ||
2.
ప్రేమించి నన్ను వెదకితివి – ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధముగా జీవించుటకై – పాపిని నన్ను కరుణించితివి ||సర్వ||
3.
అల్పకాల శ్రమలనుభవింప – అనుదినము కృపనిచ్చితివి నాథుని అడుగుజాడలలో – నడుచుటకు నన్ను పిలిచితివి ||సర్వ||
4.
మరణ శరీరము మార్పునొంది – మహిమ శరీరము పొందుటకై – మహిమాత్మతో నన్ను నింపితివి – మరణ భయములను తీర్చితివి ||సర్వ||