FaithWalk
← Back to Library

#688వెండి బంగారములకన్న - యేసుని కలిగియుండెదమ

Author: UnknownCategory: రెండవ అనుబంధము
ప
వెండి బంగారములకన్న – యేసుని కలిగియుండెదము వెలగల భూషణములకన్న – యేసుని కలిగియుండెదము
1.
అడవిరాజు తన పిల్లలను – లేమి కలిగి ఆకలిగొనును దేవుని ఆశ్రిత జనులకు ఎప్పుడు – మేలులు కొదువై యుండవుగా ||వెండి||
2.
మన ప్రభువుండు మహాదేవుడు – ఘనమహోన్నత్యము గల రాజు రక్షణ కర్త ప్రధానకాపరి – ఆయన మేపెడి గొర్రెలము ||వెండి||
3.
వారి గుర్రములు రథములను బట్టి జనులు గర్వింతురు మనమైతే మన దేవుని నీతి – న్యాయములను శ్లాఘింతుము ||వెండి||